గోనె సంచిలో వ్యక్తిని కుక్కి.. కారులో సజీవ దహనం

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆదివారం రాత్రి వనవాడ రోడ్డులో ఒక వ్యక్తిని గోనె సంచిలో కుక్కి కారులో సజీవ దహనం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కారు కాలిపోతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే గోనె సంచిలో ఉన్న వ్యక్తి మంటల్లో కాలి మరణించినట్లు గుర్తించారు. మృతుడిని ఔసా తండాకు చెందిన గణేష్ చవాన్‌గా గుర్తించారు. అతడిని గోనె సంచిలో కుక్కి కారు సీటులో ఉంచి నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్