ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా ఘోల్టిరాలో ఓ వ్యక్తి వీధి కుక్కను నదిలోకి తోసి, రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. నదిలోని రాళ్ల మధ్య చిక్కుకున్న కుక్క బయటకు రాకుండా నిందితుడు పదేపదే పెద్ద రాళ్లను విసిరి దాని ప్రాణాలు తీశాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.