బస్సులో యువతిని అనుచితంగా తాకాడు (వీడియో)

కేరళలోని కట్టకాడలో ఓ ఆర్టీసీ బస్సులో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బస్సులో మహిళ పక్కన కూర్చొని.. ఆమెను అనుచితంగా తాకాడు. దీంతో సదరు మహిళ సైలెంట్‌గా వీడియో రికార్డ్ చేసి అతనిపై చెంపదెబ్బలు, పిడిగుద్దులు కురిపించింది. వెంటనే కండక్టర్ అతన్నీ పంపించాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్