పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా జిల్లా బల్లిగంజ్ స్టేషన్‌లో ఫిబ్రవరి 3న రాత్రి 7.30 గంటలకు ఒక వ్యక్తి ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై నుంచి రైలు పట్టాలపైకి దూకాడు. అదే సమయంలో స్టేషన్‌కు చేరుకున్న లోకల్ రైలుపై పడటంతో, ఓవర్‌హెడ్ హైటెన్షన్ విద్యుత్ వైర్లలో చిక్కుకుని విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు.