బస్‌పాస్‌ కోసం వెళ్లిన వ్యక్తి.. అనుమానాస్పద స్థితిలో మృతి

AP: విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపింది. బస్సు పాస్ కోసం వెళ్లొస్తానని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన వానపల్లి సోమేశ్వరరావు అలియాస్ చిట్టి (36) మృతిచెందాడు. బుధవారం ఉదయం తుమ్మికాపల్లి శివారులోని ఓ ఇంట్లోని గదిలో మృతదేహంగా కనిపించాడు. కన్ను, మెడపై గాయాలు, ముక్కు నుంచి రక్తస్రావం కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం మత్తులో తోపులాట జరిగినట్టు సీసీటీవీలో నమోదైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్