ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో ఆవు దూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి ఆవు తల్లడిల్లిపోయింది. ట్యాంక్ చుట్టూ తిరుగుతూ.. అరుస్తూ దారినపోయే వారిని దీనంగా పిలిచింది. తల్లి ఆరాటం చూసి చలించిన స్థానికులు వెంటనే స్పందించారు. తాళ్ల సాయంతో దూడను సురక్షితంగా బయటకు తీశారు. బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో తల్లి ఆవు సంతోషానికి అవధుల లేవు.