ఆసిఫాబాద్ మండలంలో చిరుతపులి సంచారం

ఆసిఫాబాద్ మండలం మానిక్ గూడ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం పంటపొలాల్లో రైతులు చిరుతపులి అడుగులను గమనించి అటవిశాఖ అధికారులు సమాచారం అందించారు. పాదముద్రలు పరిశీలించిన అటవీ శాఖ అధికారులు అది చిరుత పులివని నిర్ధారించారు. చిరుత పులి అడుగు జాడల ఆధారంగా అధికారులు ట్రాకింగ్ చేస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవిశాఖ అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్