తిర్యాణి మండలం గోవెన నాయకపూగూడ గ్రామస్థులు తమ పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి వస్తోందని, దీనివల్ల సుమారు 20 మంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. తమలాగే తమ పిల్లలు కూడా చదువుకోలేక వేలిముద్రగాళ్లుగా మిగిలిపోకూడదని గ్రామస్థులు వాపోయారు.