బెల్లంపల్లి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల సంబంధించిన హెల్ప్ డెస్క్ ను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు సంబంధించిన సేవలు, ఇతర ఓటింగ్ తదితర అంశాలపై హెల్ప్ డెస్క్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.