బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, తత్సమాన అర్హతలు కలిగిన విద్యార్థులు ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని చుట్టుప్రక్కల గ్రామాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.