బెల్లంపల్లిలో రేపు ఆటోలు బంద్

ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్ పై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో ఆటోల బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆటో డ్రైవర్ సంఘం నాయకులు పేర్కొన్నారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ఆయనపై దాడికి దిగినట్లు పేర్కొన్నారు. ఆయనపై దాడికి నిరసనగా చేపట్టిన బంద్ లో ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్