బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువుల వద్ద ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోనున్న ఆడపడుచులకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్