బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల శివారు పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఏర్పాటుచేసిన బోరును స్థానిక సర్పంచ్ మంగళవారం ప్రారంభించారు. వచ్చే నెల రెండవ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరుల కోసం ఎమ్మెల్యే వినోద్ సహకారంతో ఈ బోరును ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా దీక్షాపరులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.