బెల్లంపల్లి పట్టణ, మండల పరిధిలో భూ కబ్జాలు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బహిరంగంగా వేలం వేసి కాంగ్రెస్ నాయకులు విక్రయిస్తున్నారని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, వీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ నూనెటి సత్యనారాయణలు ఆరోపించారు. భూ కబ్జాలు, ప్రభుత్వ పథకాలలో అవినీతి, అక్రమాలను నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.