రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లి ఏఎంసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆయన ఎద్దేవా చేశారు.