మేడే వేడుకల సందర్భంగా బెల్లంపల్లిలో ఐఎఫ్ టీయు జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 29 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మారుస్తూ కేంద్రం అమలు చేస్తుందని, ఇది కార్మికులకు నష్టం కలిగిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.