బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ నోటిఫికేషన్ ప్రకారం మూడవ, చివరి విడత డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో డిగ్రీ సీట్ల కేటాయింపు జరగగా ప్రస్తుతం డిగ్రీ ప్రవేశానికి చివరి అవకాశం అందుబాటులో ఉందని వివరించారు.