బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఆసుపత్రికి ప్రదమ బహుమతి దక్కింది. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి పదిహేను లక్షల రూపాయల మొదటి బహుమతి వచ్చింది. ఆసుపత్రిలోని ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా తర్వాత పీర్ అసెస్మెంట్ ద్వారా, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఎక్స్టర్నల్ అసెస్మెంట్ ద్వారా ఈ స్కోర్ ఇవ్వడం జరుగుతుందని ఆసుపత్రి సూపర్డెంట్ రవికుమార్ తెలిపారు. ఆసుపత్రికి 92.6% స్కోర్ రావడం జరిగిందని పేర్కొన్నారు.