బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాత సముద్రాల కరుణాకర్ సహకారంతో యాచకులు, నిరుపేదలు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.