అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు బెల్లంపల్లిలో కొనసాగుతున్నాయి. గురువారం పదో వార్డు మాజీ కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకులు రవీందర్ రెడ్డి, నగేష్ లు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరిక అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది.