బెల్లంపల్లి: మాజీ మంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద జరగనున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆయన పార్టీ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మాజీ మంత్రి రానున్నారని, పట్టణంలోని 34 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్