బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సందడి నెలకొంది. ఈనెల 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బజార్ ఏరియాలో పూలు, పండ్లు, ప్రమిదలు, ఇతర పూజా సామాగ్రి విక్రయించేందుకు పలు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేశారు. బజారు ఏరియా నుంచి కాంటా చౌరస్తా వరకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఈ దుకాణాల వద్ద భక్తులు పోటీపడి పూజా సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు.