బెల్లంపల్లి: నాణ్యమైన విత్తనాన్ని మన గ్రామంలోనే పండిద్దాం

బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో శాస్త్రవేత్తలు అందించిన వరి ధాన్యాన్ని సాగుచేసిన రైతు పొలాన్ని వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్ సందర్శించారు. నాణ్యమైన విత్తనాన్ని మన గ్రామంలోనే పండించుకుందామని ఆయన రైతులకు సూచించారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం ఎకరాకు 28 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని, ధాన్యాన్ని విక్రయించే బాధ్యత వ్యవసాయశాఖ తీసుకుంటుందని రైతులకు వివరించారు.

సంబంధిత పోస్ట్