బెల్లంపల్లి: చల్లంగా చూడమ్మా.. మైసమ్మ తల్లి

బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో దారి మైసమ్మ తల్లికి ఆషాడమాసం బోనాల జాతరను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళా భక్తులు నెత్తిమీద బోనాలను ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య ఆలయం వరకు భారీ ఊరేగింపుగా వెళ్లారు. ఆలయంలో మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు సమృద్ధిగా కురవాలని, పిల్లా పాపలను సల్లంగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్