బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ వ్యాపారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. గత రెండు రోజులుగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మార్కెట్ వెలుపల కూరగాయల అమ్మకాలను అడ్డుకోవాలని, హోల్సేల్ వ్యాపారాలు కూడా బెల్లంపల్లి మార్కెట్లోనే జరిగేలా చూడాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు.