బెల్లంపల్లి: బోనాల జాతరకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

బెల్లంపల్లి మండల శివారులోని జాతీయ రహదారి వద్ద నెలకొని ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో ఆదివారం నిర్వహించనున్న బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా రావాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను ఆహ్వానించారు. మైసమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ రాజలింగు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. బోనాల జాతరకు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటామని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్