బెల్లంపల్లి: పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు విడుదల చేయాలి

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దాగం శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాలర్ షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్