బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు బుధవారం ఏఐటీయూసీ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. నాయకులు మల్లేష్, వెంకటస్వామి, తిరుపతి గౌడ్ లు గనిలో బొగ్గు ఉత్పత్తిని పునర్ ప్రారంభించాలని కోరారు. అధికారుల సమన్వయ లోపం వల్లే గనిలో ఉత్పత్తికి విఘాతం కలిగిందని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.