బెల్లంపల్లి మండల ఏఈఓ తిరుపతి, రైతులు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. జగిత్యాల వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కన్నాల రైతు వేదిక, బుధకుర్ధ్ గ్రామాల్లో నిర్వహించిన మట్టి పరీక్షల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మట్టి పరీక్షల ఆధారంగా సాగు చేయడం వల్ల పంటలకు అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతాయని, అవసరానికి మించిన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నేల సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.