బెల్లంపల్లి ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ భార్గవ్ మృతికి ఎంపీడీవో మహేందర్ వేధింపులే కారణమని నేతకాని మహర్ సేవా సంఘం నాయకులు మహేందర్, గట్టు బానే, శ్రీకాంత్, రాజలింగులు ఆరోపించారు. బెల్లంపల్లిలో వారు మాట్లాడుతూ, ఎంపీడీవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో గతంలో పనిచేసిన పలు మండలాల్లో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.