బెల్లంపల్లి తాజ్ బాబా సేవా సమితి యాచకునికి చేయూతనందించింది. దాదాపు మూడు నెలల నుంచి ఒక యాచకుడు రోడ్డుపై దుర్వాసనతో తిరుగుతుండడం తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ గమనించాడు. వెంటనే స్పందించి ఆ యాచకునికి క్షవరం చేయించి దుస్తులు అందించారు. ఈ కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు రోషన్, ఉమెన్ క్రిష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు