బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని 13వ వార్డు కౌన్సిలర్ పేర్కొన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కౌన్సిలర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.