బెల్లంపల్లి: రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు

బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఏఎంసీ వైపునకు వెళ్లే ప్రధాన అంతర్గత రహదారిపై రావి చెట్టు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎత్తివేతకు గురైన సింగరేణి ఎక్స్ప్లోరేషన్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఈ సంఘటన జరిగింది. రోడ్డు అంతా చెట్టు విస్తరించడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు, రాత్రిపూట చెట్టు విరిగిపడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్