బెల్లంపల్లి మండలంలోని దిగ్నేపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘం భవన నిర్మాణానికి సర్పంచ్ లలిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. గ్రామ సమైక్య సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈ విష్ణు, సిసి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.