బెల్లంపల్లి: గంజాయి తరలిస్తున్న యువకుడి అరెస్టు

బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద గంజాయి తరలిస్తున్న హనుమాన్ బస్తీకి చెందిన మహదేవుని శివమణిని సీఐ శ్రీనివాసరావు అరెస్టు చేశారు. పోలీసుల తనిఖీల్లో అతని వద్ద 200 గ్రాముల గంజాయి లభించింది. విచారణలో, నిందితుడు చంద్రాపూర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, బెల్లంపల్లికి రైలు మార్గంలో తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్