బెల్లంపల్లిలోని శాంతిఖని గని షాఫ్ట్ ఆవరణలోని మైసమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిలో ఉదయం నుండి అభిషేకం, గణపతి పూజ, కలశ స్థాపన అమ్మవారి చండీ హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.