భీమిని: యూరియా కోసం రైతుల ఆందోళన

భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. సోమవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈవో రాజేశ్వర్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది యూరియా పంపిణి నిలిపివేశారు. రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు గొడవ చేశారు. యూరియా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సరైన ఆధారాలు దొరికితే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్