భీమిని: వైన్స్ షాపులో చోరీ

భీమిని మండల కేంద్రంలోని మాధవి వైన్స్ షాపులో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షాపు తాళాలు పగలగొట్టి, షట్టర్ కింద నుంచి లోనికి ప్రవేశించి, సుమారు 25వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లను అపహరించుకెళ్లారు. దుండగులు షాపు చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్