భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.