మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో ప్రజలు హోలీ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నారులు రంగులు చల్లుకుంటూ సంబరాల్లో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ స్నేహితులకు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలిపారు.