కళ్లెంపల్లిలో పల్స్ పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలోని వేమనపల్లి మండలం కళ్లెంపల్లి గ్రామంలో ఆదివారం, 28 జూన్ 2026న పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ ఆలం లక్ష్మణ్, ఉప సర్పంచ్ ఆత్రం శంకర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ANM, ఆశా వర్కర్ కరిపేత సరిత, అంగన్‌వాడీ టీచర్ కుడిమేత మాలతి, వార్డు సభ్యులు, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్