మంగనపల్లిలో ఘనంగా సమ్మక్క సారక్క జాతర, బోనాలతో భక్తుల మొక్కులు

మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలోని మంగనపల్లి గ్రామంలో 2026 జనవరి 30న సమ్మక్క సారక్క జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయ వేషధారణలో బోనాలు ఎత్తుకుని గద్దెల వద్దకు చేరుకున్నారు. డప్పులు, వాయిద్యాల నడుమ గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా బోనాల కార్యక్రమం జరిగింది. పూజారి రజిత ఆధ్వర్యంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, జాతర ప్రాంగణం భక్తుల నినాదాలతో మార్మోగింది.

సంబంధిత పోస్ట్