బెల్లంపల్లిలో సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పట్టణంలో వరదలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.