తాండూరులో అయిన జూనియర్ కళాశాల తరగతులు ప్రారంభించాలి.. బీఆర్ఎస్వీ

తాండూరు మండలానికి మంజూరు అయిన జూనియర్ కళాశాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తాండూరు మండలంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జూనియర్ కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం హంగు ఆర్భాటాలతో తాండూరు మండలానికి జూనియర్ కళాశాల మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు తరగతులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్