కన్నేపల్లి: సిఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం

పేదలకు కార్పొరేట్ వైద్య చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం వరంలా పనిచేస్తుందని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరావు అన్నారు. సోమవారం కన్నెపల్లి మండలంలోని జనకాపూర్, వీరాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామాంజనేయతో కలిసి అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్