విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కన్నెపల్లి మండలం జనకాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి సంతోష్ రావు పాఠశాలకు అందించిన 72 సైకిళ్ళను జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్యతో కలిసి పంపిణీ చేశారు.