మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలంలో తుడుందెబ్బ నూతన కమిటీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికలో మంగ శ్రీకాంత్ మండల అధ్యక్షుడిగా, ఆత్రం మహేష్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను అభినందించిన నాయకులు, సంస్థను బలోపేతం చేయడంతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.