ప్రజల రక్షణ కోసమే చట్టాలు ఉన్నాయని, పౌరులు తమ హక్కులను కాపాడుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. పౌర హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ పంచాయితీలో గురువారం పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. పౌర హక్కులపై ఆయన ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.