కాసిపేట: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ, కాసిపేట మండలంలోని దేవాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు రమణా రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున ధర్నా చేపట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అసమర్థ పాలన నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సిట్ ను ఉపయోగించి కేసీఆర్, కేటీఆర్, హర్షిష్ రావులను విచారణ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్