కాసిపేట మండలం ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని మండల ఇన్చార్జ్ జిలకర శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఎన్నుకున్నారు. మండల కన్వీనర్ గా గొడిసెల శ్రీకాంత్, కో కన్వీనర్ గా కాంపెల్లి వెంకటేష్ ను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ, ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎన్నికైన కన్వీనర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.